World's first medical networking and resource portal

Community Weblogs

Nov16
అదనపు బరువు వదిలించుకోండి... ఆరోగ్యంగా ఉండండి... వారం రోజుల్లో 4 కేజీల బరువు తగ్గండి...వారంలో రోజులలో 4 నుండి 5 కేజీల బరువు తగ్గటం సాధ్యమేనా? అవును సాధ్యమే. ఇదేదో ఒబేసిటి సెంటర్ల వ్యాపారప్రకటనో, టీవీల్లో చూపే టెలిబ్రాండ్‌ ప్రకటనో కాదు. ఎక్కడికి వెళ్ళకుండా, ఖర్చు లేకుండా మీ ఇంట్లోనే శాస్త్రీయ పద్ధతుల్లో బరువు తగ్గే పద్ధతి. దీనికి కావల్సిందల్లా అదనపు బరువు తగ్గాలన్న బలమైన కోరికా, అమలుపరిచే దృఢ సంకల్పం. ఆ తరువాత బరువు పెరగకూడదన్న తలంపు మీకుంటే చాలు. ఈ కార్యక్రమాన్ని అమెరికాలోని జాన్‌హప్‌కిన్స్‌ రీసెర్చ్‌ సెంటర్‌ రూపొందించింది. ప్రయోగాత్మకంగా రుజువైంది. ఇది అమెరికన్‌ ఫుడ్‌ అండ్‌ డ్రగ్స్‌ అడ్మినిస్ట్రేషన్‌ (ఎఫ్‌డిఎ) ఆమోదం పొందింది. వారంరోజుల పాటు మీరు తీసుకునే ఆహారం శరీరానికి ఏమాత్రం అదనపు కాలరీలను ఇవ్వకుండా మీ వంట్లో ఉన్న అదనపు నిల్వలను ( కొవ్వు, ప్రొటీన్లను) కరిగించడానికి ఉద్దేశించిన డైట్‌ చార్టు ఇది. మరైతే ఆలస్యం దేనికి ? వెంటనే ప్రారంభించండి. ముందుగా మీ అదనపు బరువు లెక్క వేసుకోండి ముందుగా మీరు ఉండాల్సిన దానికన్నా అదనంగా ఎంత బరువు ఉన్నారో చూడండి. అదనపు బరువును లెక్కించటానికి ఒక చిన్న లెక్క. ముందుగా మీ బరువును కేజీలలో, మీ ఎత్తును సెంటీమీటర్లలో కొలుచుకోండి. సెంటీమీటర్లలో మీ ఎత్తు నుండి 100 తీసెయ్యండి. వచ్చిన విలువను 0.9తో హెచ్చించండి. అది మీరుండాల్సిన బరువు. మీరు ఉన్న బరువులో నుండి ఉండాల్సిన బరువు తీసివేస్తే మీరు ఎంత అదనంగా ఉన్నారో తెలుస్తుంది. ఇక వారంరోజుల డైట్‌ చార్టులోకి వెళ్లి మీరు ఏమేం తినాలో, ఎలా తినాలో చూద్దాం. ప్రతిరోజు ఆహార నియమాలతో పాటు చివర ఇచ్చిన సాధారణ నియమాలను ఖచ్చితంగా పాటించాలి. మొదటిరోజు అరటిపండు తప్ప అన్నిరకాల తాజా పళ్ళు: ఈ రోజు మీ ఆహారం. మీకు నచ్చిన అన్నిరకాల పండ్లను తినొచ్చు. అరటి పండు మాత్రం లేదు. ప్రత్యేకించి పుచ్చకాయలు, కిరిణికాయలు (కడప దోసకాయలు) ఎక్కువ తింటే మంచిది. పరిమితి ఏమీ లేదు. మీ అవసరం మేరకు తినొచ్చు. పళ్ళను ఆహారంగా తీసుకోవటం వల్ల రాబోయే ఆరు రోజులకు మీ శరీరాన్ని, జీర్ణవ్యవస్థను సిద్ధం చేస్తున్నారన్నమాట. రెండవరోజు అన్నిరకాల కూరగాయలు : ఈ రోజు మీ ఆహారం కేవలం కూరగాయలు మాత్రమే తినాలి. బ్రేక్‌ఫాస్ట్‌గా ఒక పెద్ద బంగాళదుంపను ఉడికించి తినటం ద్వారా ఈ రోజును ప్రారంభించండి. తరువాత బంగాళాదుంప తినొద్దు. మిగతా కూరగాయలు పచ్చివి కాని, ఉడికించినవి కాని తినొచ్చు. ఉప్పు, కారం మీ ఇష్టం. నూనె మాత్రం వాడొద్దు. ఈ రోజు కూడా పరిమితి అంటూ ఏమీ లేదు. మీ అవసరం మేరకు తినొచ్చు. మూడవరోజు పళ్ళు, కూరగాయలు : పళ్లలో అరటిపండు, కూరగాయల్లో బంగాళాదుంప తప్ప మిగిలిన పళ్ళు, కూరగాయలు కలిపి తీసుకోండి. ఈ రోజు కూడా పరిమితి ఏమీ లేదు. అవసరం మేరకు తినొచ్చు. ఈ రోజు నుండి మీ శరీరంలో అదనపు కొవ్వు విలువలు కరగటం ప్రారంభిస్తాయి. నాల్గవ రోజు 8 అరటిపళ్లు, మూడు గ్లాసుల పాలు : నాల్గవరోజు దాదాపు ఆకలి ఉండదు. రోజంతా హాయిగా గడచిపోవడం గమనిస్తారు. 8 అరటిపళ్ళు తినాల్సిన అవసరం రాకపోవచ్చు. తగ్గించగలిగితే తగ్గించండి. (ఒక గ్లాసు 200 మి.లీ.) పాలల్లో చక్కెర ఎక్కువ ఉండకూడదు. ఇంకా అవసరం అనిపిస్తే 100 మి.లీ. వెజిటబుల్‌ సూప్‌ తాగవచ్చు. (తాజా కూరగాయలతో మీ అభిరుచికి తగ్గట్లు మీ ఇంట్లో తయారుచేసింది మాత్రమే తాగండి). ఐదవ రోజు ఒక కప్పు అన్నం, 6 టమోటాలు : మీకిది విందు రోజు. మధ్యాహ్నం ఒక కప్పు అన్నం, దానిలోకి కూరగాయలు లేదా ఆకుకూరతో నూనె లేకుండా వండిన కూరతో తినండి. ఉదయం టిఫిన్‌గా రెండు టమోటాలు తీసుకోండి. మిగిలినవి అవసరం అయినప్పుడు తినండి. కప్పు అన్నం తినొచ్చు కదా ఏమవుతుందని ఇంకాస్త లాగించే పని చేయవద్దు. వీలయితే కప్పు కన్నా కాస్త తక్కువే తినండి. ఆరవరోజు ఒక కప్పు అన్నం, కూరగాయలు, పళ్ళరసం : రెండవ రోజు తిన్నట్లు పచ్చివి లేదా వండిన కూరగాయలు (బగాళ దుంప మినహా) తీసుకోండి. అన్నంలోకి కూర 5వ రోజు చెప్పినట్లే. కూరగాయలకు లిమిట్‌ లేదు. అయినప్పటికి ఆకలి లేకపోవడం వల్ల రెండవ రోజు తిన్నంత అవసరం లేదు. ఏడవరోజు ఒక కప్పు అన్నం, కూరగాయలు, పళ్ళరసం: ఆరవరోజులాగే తింటూ, అదనంగా కూరగాయలను కాస్త తగ్గించి, పళ్ళరసం (చక్కెర లేకుండా) తీసుకోండి. మధ్యాహ్నం యథావిధిగా ఒక కప్పు లేదా అంతకంటే తక్కువ అన్నం తినండి. ఇక రేపటి కోసం ఎదురుచూడండి. వారం తరువాత మీలో మార్పును మీరే కాకుండా పక్కవాళ్ళు సైతం గుర్తించేలా ఉంటుంది. మీ బరువు ఎంత వున్నారో చూసుకోండి. ఈ పద్ధతి కచ్చితంగా పాటిస్తే, శరీరం అవసరం మేరకు తింటే, 4 నుండి 5 కేజీల బరువు తగ్గుతారు. మినహాయింపులూ, ఉల్లంఘనలు ఉంటే దానికి తగ్గట్టే తగ్గుతారు. ఇంకా మీరు బరువు తగ్గాలంటే కనీసం రెండు వారాల విరామం తర్వాత లేదా మళ్లీ మీ ఇష్టం వచ్చినప్పుడు ఇదే వారం చార్టుని తిరిగి ప్రారంభించండి. ఈ విధంగా మధ్య మధ్యలో విరామంతో మీ బరువు తగ్గించదలచుకున్నంత వరకు ఈ చార్టుని ఫాలో కావచ్చు. వారం రోజుల పాటు ఈ పద్ధతిని పాటించడం వల్ల ఆ తరువాత కూడా మీకు పెద్దగా ఆకలి ఉండదు. అంటే ఆకలి స్థాయి తగ్గుతుంది. కాబట్టి ఇక నుండి మీ ఆహారపు అలవాట్లను పక్కాగా మార్చుకుని పరిమితంగా తింటూ వుంటే మీ బరువు అదుపులో ఉంటుంది. లేదంటే మళ్ళీ లావు పెరుగుతారు. సాధారణ నియమాలు 1. ఈ వారం రోజులు మీరు 20 నిమిషాలపాటు ఒక మోస్తరు వ్యాయామం అంటే నడక, సైక్లింగ్‌, ఎరోబిక్స్‌, స్విమ్మింగ్‌లాంటి వాటిలో ఏదో ఒకటి చెయ్యాలి. 2. రోజూ 10 గ్లాసులకు తక్కువ కాకుండా నీళ్ళు తాగాలి 3. పైన చెప్పిన ఆహారం అవసరం మేరకు తినాలే తప్ప తినమన్నాం కదా అని అవసరం లేకపోయినా తింటే ఫలితం అనుకున్నంత రాదని గుర్తించండి. 4. ఏడు రోజులు మీరు తినే ఆహారంతో పాటు ఈ క్రింద వాటితో చేసిన వెజిటబుల్‌ సూప్‌ పరిమితి లేకుండా ఎప్పుడైనా తాగవచ్చు. వెజిటబుల్‌ సూప్ తాయారు చేసే విధానం: పెద్ద ఉల్లిపాయలు రెండు, క్యాప్సికప్‌ ఒకటి, టమోటాలు మూడు, 30 గ్రాముల క్యాబేజి, కాస్తంత కొత్తిమీర, 500 మిల్లీ లీటర్ల నీరు, ఉప్పు, మిరియాలపొడి మీ ఇష్టాన్ని బట్టి. వీటితో సూప్‌ చేసుకోవచ్చు. గమనిక : బరువు పెరగడం అనేది మనిషి తినే ప్రవర్తనకు సంబంధించిన సమస్య. తిండి విషయంలో మీ ప్రవర్తన మార్చుకోకుండా బరువు తగ్గాలనుకోవడం జరగని పని. ఇందుకు మీరు ఒబెసిటి సెంటర్ల చుట్టూ తిరిగితే చేతి డబ్బులు వదలటం, ఆరోగ్యం పాడుకావడం తప్ప ఒరిగేదేమీ ఉండదు. ఓబెసిటి సెంటర్లది ప్రచార ఆర్భాటం, మోసం తప్ప మరేమి కాదు. సలహాల కోసం మీ కుటుంబ డాక్టరును లేదా సంబంధిత వైద్య నిపుణులను సంప్రదించండి. బరువు తగ్గారా ?బాగానే ఉంది! కాని జాగర్తలు తీసుకోక పొతే తగ్గిన బరువును సరిగ్గా నెల నుండి రెండు నెలల్లో తిరిగి మామూలుగా అంతకు ముందు ఎంత బరువు ఉన్నారో అంతకు వస్తారు! తగ్గిన బరువును అలాగే ఉంచుకోవాలంటే ఏమి చేయాలి ? తీరిక దొరికినప్పుడు రాస్తాను. అప్పుడు తెలుసుకోండి - Dr. P. Srinivasa Teja


Comments (0)  |   Category (Cosmetology)  |   Views (3694)

Community Comments
User Rating
Rate It


Post your comments

 
Browse Archive